వైఎస్ షర్మిల అరెస్ట్..తెలంగాణలో హై టెన్షన్

వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. షర్మిలను బొల్లారం పోలీస్ స్టేషన్ కి తరలించారు. తెలంగాణ రాష్ర్టంలో మహిళలపై జరుగుతున్న ఆగాయిత్యాలకు నిరసనగా ట్యాంక్ బండ్ రాణి రుద్రమదేవి విగ్రహం వద్ద వైఎస్ షర్మిల మౌనదీక్షకు
దిగారు. షర్మిల చేపట్టిన మౌన దీక్షను పోలీసులు బగ్నం చేసిన.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ట్యాంక్ బండ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. షర్మిల అరెస్ట్ కి నిరసనగా మహిళలు భారీ సంఖ్యలో అక్కడి చేరుకున్నారు. ఆమెను పోలీస్ స్టేషన్ కి తరలించకుండా పోలీస్ వాహనాలకు అడ్డుగా కూర్చొని తమ నిరసన తెలిపే ప్రయత్నం చేశారు.

అయినప్పటికీ మహిళలను పక్కకు ఈడ్చి మరీ శర్మిలను పోలీస్ స్టేషన్ కి తరలించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మహిళలను ఇలా అగౌరవ పరచడం చాలా దురదృష్టకరం అంటూ.. మహిళా సంఘాలు తెలంగాణ సర్కారుపై మండిపడుతున్నారు. మహిళలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించడమే తాము చేసిన తప్పా అంటూ నిలదీస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నించే గొంతును నొక్కుతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు.
వైఎస్ షర్మిలను అరెస్ట్ ను ఆ పార్టీ నాయకులు ఖండించారు.