వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు

వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టిస్తోందో. గత నాలుగేళ్లుగా విచారణ పేరుతో నలుగుతూ.. వస్తోంది. ఈ కేసులో రోజురోజుకి ఏదో ఒక ట్విస్ట్ తెరపైకి వస్తూనే ఉంది. ఈ కేసులో అసలు ముద్దాయిలు ఎవరు..? తెలంగాణ రాష్ట్రానికి ఈ కేసును ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చింది..? ఏపీలో అడ్డంకులు ఎదురవుతున్న మాట వాస్తవమేనా..? వివేకా లాంటి VIP హత్యకు బలమైన కారణం ఏంటి..? అసలు ఎలాంటి కారణాలతో ఈ హత్య జరిగింది..? ఈ కేసులో వైఎస్ ఫ్యామిలి నిందా ఆరోపణలు ఎదుర్కొంటోందా..? సీబీఐ ఆధ్వ‌ర్యంలో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డిపై కుట్ర‌లు జ‌రుగుతున్నాయా..? వైఎస్ ఫ్యామిలీని రాజ‌కీయంగా దెబ్బకొట్టాలనే ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తోందా..?
ప్రస్తుతం ఇలాంటి ప్రశ్నలే.. రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశంగా మారాయి. అసలు ఈ కేసులో దోషులెవరు? నిర్దోషులెవరు?.. ఈ కేసు ఓ కొలిక్కి రావాలంటే ఇలా ఇంకెంతమందిని విచారించాల్సి ఉంటుంది. త‌న‌ను ఇరికించే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌ని .. వేరే కార‌ణాల‌తో వివేకా హ‌త్య జ‌రిగి ఉంటే, దాన్ని త‌న మెడ‌కు చుట్టే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌ని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో ఇంజనీరింగ్ చదివి లండన్ లో MBA చదివిన ఎంపీ అవినాష్ రెడ్డికి.. వైఎస్ వివేకాను హత్య చేయాల్సిన అవసరం ఏంటి..? మొన్నటి వరకు సీఎం జగనే సొంత బాబాయ్ ని హత్య చేయించాడని.. ప‌చ్చ‌మీడియా బాగా ప్ర‌చారం చేసింది. ఇప్పుడేమో.. అవినాష్ రెడ్డే చేయించాడని నోటికొచ్చినట్టు మాట్లాడుతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం వైఎస్ జగన్ కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి సొంత పార్టీ పెట్టుకుంటే.. వివేకానంద రెడ్డి మాత్రం కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఇక్కడే తేలిపోయింది వివేకాకు సొంత ఫ్యామిలీ అంటే ఎంతటి ప్రేమో అనేది. పైగా 2011లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో వివేకానంద రెడ్డి.. వైఎస్ విజయమ్మపై పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత వివేకానంద రెడ్డి చేసేది ఏమీ లేక 2012 లో YCPలో చేరారు. 2014లో అవినాష్ రెడ్డికి వైఎస్ జగన్ ఎంపీ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో అవినాష్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందారు. అప్పటికీ తమ కుటుంభ సభ్యుడు అన్న విశ్వాసం, తన సొంత బాబాయ్ అన్న ప్రేమ, వయసులో పెద్ద వాడు అన్న మర్యాదతో వైఎస్ జగన్.. వివేకానంద రెడ్డికి
2017లో పూర్తి మెజారిటీ ఉన్న కడప నుంచి MLC టికెట్ కేటాయిస్తే.. అప్పట్లో అధికారంలో ఉన్న చంద్రబాబు ysrcp MPTC, ZPTC లను కొని.. వివేకాను ఓడించాడు. దీనిని బట్టి చూస్తే.. వైఎస్ ఫ్యామిలీ సభ్యులపై చంద్రబాబు కక్ష కట్టరాని చాలా క్లియర్ గా అర్ధమవుతుందనే చెప్పొచ్చు.
అక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ.. ఆ తర్వాత 2019 ఎన్నికలు వస్తున్న తరుణంలో రాజకీయాలు ఒక్కసారిగా టర్న్ అయ్యాయి. సిట్టింగ్ ఎంపీ అయిన అవినాష్ రెడ్డికే మళ్ళీ టికెట్ అని వైఎస్ జగన్ అప్పటికే ప్రకటించారు. వివేకానంద రెడ్డి కూడా మద్దతు పలికారు. మరి ఇక్కడ టికెట్ కి సంబందించి వారిలో వారికి ఎలాంటి గొడవలు లేనప్పటికీ.. టిడిపి కావాలనే వారి మధ్య చిచ్చు పెట్టాలని..టికెట్ ఇవ్వలేదనే వివేకానంద రెడ్డి జగన్ పై అలిగారని.. ఇంకా ఎన్నో రకాల కట్టుకధలు అల్లి.. నానా రచ్చ చేశారు. వైఎస్ జగన్ సొంతగా పార్టీ పెడితే.. జగన్ కి ధైర్యంగా ఉండకుండా, కాంగ్రెసు ని వీడకుండా, పైగా విజయమ్మ మీద పోటీకి దిగిన వ్యక్తికి జగన్ ఎలా టికెట్ ఇస్తారనుకున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసమే వివేకాను హత్య చేయించారని టిడిపి ఆంటోన్నదానిలో ఏ మాత్రం నిజాలు లేవని చెప్పాలి. ఎందుకంటే కడపలో వైఎస్ ఫ్యామిలీకి ఉన్న పట్టు ఏంటో రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఆల్రెడీ .. అవినాష్ రెడ్డి ఒక సారి గెలిచి ఎంపీ కూడా అయ్యారు. అప్పటికే వైఎస్ జగన్ పాదయాత్ర వల్ల ప్రజల మనసుల్ని గెలిచి.. గొప్ప నాయకుడిగా ఎదిగారు. అలాంటిది ఆయనను హత్య చేయిస్తే ఓట్లు పడతాయని అనుకోవడం, సింపతీ వస్తుంది అనుకోవడం కూడా పోరాపాటే. అప్పటికే వైఎస్ రాజశేఖర్ రెడ్డిని పోగొట్టుకొని పుట్టెడు దుఖంలో ఉన్నారు. సొంత కుటుంభ వ్యక్తిని పోగొట్టుకోవాలని ఎవ్వరూ ఇలాంటి కుట్రలు చేయరు. అలా చేసేది కేవలం ఒక్క చంద్రబాబు మాత్రమే. పార్టీ కోసం ఆయనలా సొంత మామకు వెన్నుపోటు పొడవటం.. బహుశా దేశ రాజకీయాలలో ఇప్పటివరకు ఎక్కడా జరగలేదు అనుకుంట. పైగా అవినాష్ ను MPగా గెలిపించమని జమ్మలమడుగులో అర్ధరాత్రి వరకు వివేకా ఎన్నికల ప్రచారం చేశారు. అదే రాత్రి ఆయన మరణించారు. ఆ విషయాన్ని స్వయంగా వివేకా కూతురు మీడియా ముందు వివరించారు. ఈ కేసుకి తన అన్న జగన్ కి ఎలాంటి సంబందం లేదని, టిడిపి నాయకులు కావాలనే జగన్ పై నిందా ఆరోపణలు చేస్తున్నానరని ఒకానొక సందర్బంలో వివేకా కూతురు మీడియా ముఖంగా బహిరంగంగానే వివరించారు. అయితే.. ఒకటి కుటుంబ సభ్యలకు ఇష్టం లేని వివేకా రెండో వివాహం చేసుకోవడం, రెండు సెటిల్మెంట్ డబ్బుల పంపకాల్లో తేడాలు వచ్చి ఉంటాయని.. అందుకే పగతో అంత క్రూరంగా చంపి ఉండొచ్చని విశ్లేషకులు సైతం తమ అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ.. ఈ కేసులో వైఎస్ ఫ్యామిలీ నిందా ఆరోపణలు ఎదుర్కొంటోందని చాలా స్పష్టంగా అర్ధమవుతోందని అంటున్నారు. మరి ఈ కేసు ఎప్పటికి ఓ కొలిక్కి వస్తుందో చూడాలి.